Friday, 25 September 2026 10:40:28 PM

మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం.....పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.... మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్...

Date : 22 October 2024 09:03 PM Views : 625

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు , ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...ఈరోజు నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారి పేర్లు గాని, మొహాలు గాని ఎలాంటి కేసులోనైనా, గ్రూపు తగాదాలలో ఐనా ఎవరి ప్రోద్బలంతో, ప్రభలంతోనైనా, ఎవరైనా ఫోన్లు లలో చెప్పడం వలన గాని నేరాలలో పాలుపంచుకోకూడదని హెచ్చరించారు. కౌన్సిలింగ్ హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాలుపంచుకుంటే చట్టంలో ఉన్న ఆక్ట్ ల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడప వలసి వస్తుందని హెచ్చరించారు. కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రధాన కారణం మీ నేర ప్రవృత్తిని విడిచి కుటుంబ సభ్యులతో కలిసి మంచి జీవన ఉపాధి ఏర్పరచుకొని సత్ప్రవర్తనతో మెలగాలని అన్నారు. కొంత మంది చెప్పిన మాటలు విని,నమ్మి చట్ట వ్యతిరేకమైన కార్యకాలపాలు పాల్పడితే బిర్యాని ప్యాకెట్లు, మందు, కొంత డబ్బు లభిస్తుందేమో కానీ అది శాశ్వతమైనది కాదని . రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు, రాత్రి, పగలు సమయంలో మీ ఇండ్లను సందర్శించి మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుందన్నారు. మీపై ఒక ప్రత్యేక టీం చేత నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మీ కదలికలని, మీ ఫోన్ నెంబర్లని సాంకేతిక ఆధారంగా ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారనేది, ఎం చేస్తున్నారనేది పూర్తి స్థాయిలో పోలీస్ సర్వ లెన్స్ లో మిమ్మల్ని గమనిస్తూ ఉంటాం అన్నారు.మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టిన మీకేం కాకుండా మేము చూసుకుంటామని ధైర్యం చెప్పిన ఎలాంటి నేరాలు పాల్పడకూడదన్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు.. నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కావున "నేరస్థులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం" అని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏ నేరం చేసినా పోలీసులు గుర్తిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నేరం చేసే ముందు, మీరు రౌడీ షీటర్ అని మీ ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య కలిగించిన, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. హత్య నేరాలకు పాల్పడిన కేసులలో నిందితులకు జీవిత ఖైదు పడే విధంగా కృషి చేయాలని అధికారులు ఆదేశించారు. కొంత మంది తమ ఫ్రెండ్స్ ను కొట్టారని, కొంతమంది మెప్పు కోసం, డబ్బుల కోసం జల్సాలకి, మత్తు పదార్థాలకు అలవాటు పడి గొడవలకు, నేరాలకు పాల్పడుతున్నారన్నారు. చట్టాన్ని చేతులకు తీసుకొంటున్నారని అది చట్టరీత్యా నేరం స్నేహితులు, ఇతరుల కోసం చట్ట వ్యతిరేకమైన కార్యాకలపాలకు పాల్పడి కేసులు నమోదు అయి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దni. ఏదైనా సమస్య ఉన్న, అపాయం ఉన్న, ఎవరైనా దాడులకు పాల్పడిన, ఇబ్బందికి గురి చేసిన పోలీస్ వారిని సంప్రదించాలని, డయాల్ 100 కి కాల్ చేయాలని సూచించారు. వెంటనే పోలీస్ స్పందిస్తారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన లక్ష్యంగా స్పష్టమైన ఆదేశాలు జారి చేయడం జరిగిందని దానికి అనుగుణంగా గంజాయి నిర్ములనపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా గంజాయి అమ్మిన, కొని సరఫరా చేసిన, అక్రమ రవాణా చేసిన, తాగిన, నిల్వ ఉంచిన చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తమన్నారు. ఈరోజు నుండి రౌడీ షీటర్స్ ఉన్న వారు ఎలాంటి నేరాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలతో పాటు పిడి యాక్ట్ అమలు చేస్తామని, చట్టప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ నుండి బహిష్కరణ, ఆస్తుల జాప్తుకు అనుమతులు తీసుకోని చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :