Thursday, 24 September 2026 03:33:22 PM

సైలెంట్ అయిన సూత్రధారి కలెక్షన్ ఏజెంట్...?

బీఆర్ఎస్ ఓటమితో బినామీలకు బిగ్ షాక్....?

Date : 03 December 2023 02:56 PM Views : 948

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమితో బినామీలకు బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అధికార పార్టీ నాయకుడి అండదండలతో 5వ ఇంక్లైన్ ఏరియాకు చెందిన ఓ ఖద్దర్ చొక్కా ముసుగు ధరించిన నాయకుడు గతంలో కాంట్రాక్టుల పేరుతో తన దగ్గర పని చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను మంజూరు చేయడానికి స్థానిక ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన సదురు బినామీ నేతకు గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. గతంలోనే తమ నాయకుడు గెలుస్తాడనే ధీమాతో నోరు జారడంతో పాటు హద్దులు మీరిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఓ యువ నాయకుడు సైతం తమ నాయకుడి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హద్దులు మీరీ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. అయితే వీరితో పాటు మరికొంత మంది బినామీలు తమ నాయకుడి అండదండలతో వ్యవహరించిన తీరు ఎన్నో వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అనుకోని పరిణామాల నేపద్యంలో రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో రానున్న రోజుల్లో బినామీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో.. వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండడంతో నియోజకవర్గంలో పరిస్థితులు ఎటు వైపు దారి తీస్తాయో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :