ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : హలో మేము పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాము. మీకు లోన్ కావాలా ఎటువంటి గ్యారెంటీ, షూరిటీలు లేకుండానే లోన్ ఇస్తాము... అంటూ కొందరు టెలి కాలింగ్ పేరుతో ఎటువంటి అనుమతులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం... పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని బస్టాండ్ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండానే కొందరు నిర్వాహకులు టెలి కాలింగ్ నిర్వహిస్తూ సింగరేణి కార్మికులే లక్ష్యంగా వారి యొక్క పర్సనల్ డేటాను అక్రమంగా ఇతరుల వద్ద వేల రూపాయలకు కొనుగోలు చేసి వారికి నిత్యం ఫోన్ లు చేసి లోన్ ల పేరుతో వేధిస్తున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కొందరు లోన్ పేరుతో బ్రాంచ్ లు ఏర్పాటు చేసిన కొందరు నిర్వాహకులు కీలక సూత్రధారులుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి.. ఎంతో ప్రతిష్టాత్మకమైన 120 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకు చెందిన కార్మికుల డేటా ప్రైవేట్ సంస్థలకు వెళుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నిర్వాహకులు ఈ డేటాను వేల రూపాయలకు ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం... ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారుల విచారణ చేపడితే పెద్ద మొత్తంలో కుంభకోణాలు బయటపడే అవకాశాలున్నట్లు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు...
Admin
Aakanksha News