Tuesday, 11 August 2026 01:42:49 PM

అర్హులైన ఫోటోగ్రాఫర్ లకు సంక్షేమ పథకాలు అందిస్తాం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 19 August 2023 03:56 PM Views : 644

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : అర్హులైన ఫోటో,వీడీయో గ్రాఫర్స్ అందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్ అధ్యక్షతన స్థానిక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా కోరుకంటి చందర్ హాజరై కేక్ కట్ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఫోటో,వీడియో గ్రాఫర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అర్హులైన ఫోటో,వీడియో గ్రాఫర లకు బీసీ బందు, దళిత బంధు, మైనార్టీ బంధు అందిస్తామన్నారు.అనంతరం సీనియర్ ఫోటో గ్రాఫర్స్ దుస్స మహేష్,సంగ సురేందర్, కందికంట్ల రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్,మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిఆర్ తులసి,గోదావరిఖని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్,కోశాధికారి బండారి ప్రసాద్, కార్పోరేటర్లు జెవి రాజు,సాగంటి శంకర్, బాలరాజ్ కుమార్,నీల శ్రీనివాస్,యూనియన్ కన్వీనర్ బైరం సతీష్, సలహాదారులు గూడూరు శ్యాంసుందర్, బాలసాని కుమారస్వామి, వేముల రమేష్,గడ్డం కుమారస్వామి,దాగం రాకేష్, గడమల్ల రఘు, శ్రీధర్, మోర విక్రమ్,ఇర్పాన్,సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్,నామని గణేష్ ,గట్టు భీష్మ, కోడి రామకృష్ణ ,ఎండి మజీద్, కట్ట నవీన్ ,ఎరుకల ప్రవీణ్, మండ సంతోష్, షర్ఫుద్దీన్, దాసరి కిషోర్, గంగాధర్ లతో పాటు పెద్ద సంఖ్యలో ఫోటో,వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :