Tuesday, 11 August 2026 04:45:42 PM

SFI నుండి రామగుండం మండల కార్యదర్శి రాంచందర్ బహిష్కరణ

Date : 01 November 2022 06:48 PM Views : 632

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని శ్రామిక భవన్ లో ఎస్ఎఫ్ఐ విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లాల ప్రశాంత్, సీపెల్లి రవీందర్ లు మాట్లాడుతూ.. రామగుండం మండల కార్యదర్శిగా కొనసాగుతున్న ఈర్ల రామచందర్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన సంఘ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇక నుండి ఈర్ల రామచందర్ కు ఎస్ఎఫ్ఐ సంఘానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ల సందీప్,సహాయ కార్యదర్శి ఎరుకల సాగర్, జిల్లా కమిటీ సభ్యులు మాధురి, రాజకుమార్,తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :