Wednesday, 12 February 2025 03:46:15 AM

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు...

Date : 26 September 2024 01:36 PM Views : 94

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ప్రదాత వీరనారీ చాకలి ఐలమ్మ 139 వ జయంతి వేడుకలను మంథని పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రజక సంఘం నాయకులు గురువారం వేరువేరుగా జరుపుకున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రజక సంఘం నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వీర వనిత, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, భూమికోసం, భుక్తి కోసం, పోరాటం జరిపిందని, నాటి దొరల ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసిన దీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, కాయితి సమ్మయ్య, ఆరెపల్లి కుమార్, గొబ్బూరి వంశీ, ఇర్ఫాన్, కనవేనా శ్రీనివాస్, ఆసిఫ్ ఖాన్, రజక సంఘం నాయకులు కొల్లూరి రాజయ్య, సమ్మయ్య, పోతరాజు సమ్మయ్య, పైడాకుల నాగరాజు, పోతరాజు శ్రీనివాస్, పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు