Wednesday, 25 March 2026 02:42:59 PM

సెక్యూరిటీ గార్డు మల్లేశ్ పై చర్యలు తీసుకోవాలి

మెడికల్ కాలేజీ ఆర్.ఎం.ఓ కు వినతిపత్రం ఇచ్చిన ఏఐవైఎఫ్ నాయకులు

Date : 21 October 2022 03:34 PM Views : 863

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మెడికల్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మల్లేష్ పేషంట్ల పట్ల, వారి అటెండెంట్ ల పట్ల దుర్సుగా ప్రవర్తిస్తూ వారిని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుందని అతని పై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామగుండం మెడికల్ కళాశాల ఆర్.ఎం.ఒ కు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం సీపీఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ తో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రామగుండం మెడికల్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మల్లేష్ ఆసుపత్రి కి వచ్చే పేషంట్స్,అటెండెన్స్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వారిని దూషించడం జరుగుతుందని తన ఇష్టానుసారంగా నిర్లక్ష్యం చేస్తూ ఆసుపత్రికి వచ్చేవారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇతనిపై శాఖా పరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అఖిలభారత యువజన సమాఖ్య (AIYF) పక్షాన డిమాండ్ చేశారు.బాధితుల తరుపున మాట్లాడానికి గురువారం మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చిన ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య తో మల్లేశ్ దురుసుగా ప్రవర్తిస్తూ మర్యాద లేకుండా ఇష్టానుసారంగా వాగ్వాదానికి దిగాడని, ఇట్టి విషయం లో ఆర్.ఎం.ఓ కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు రణవేని సుధీర్ కుమార్, రేణిగుంట్ల ప్రీతం పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :