Thursday, 24 September 2026 03:33:15 PM

బీఆర్ఎస్ చీఫ్ గా ఢిల్లీ కి ముఖ్యమంత్రి కేసీఆర్

Date : 06 October 2022 12:55 PM Views : 492

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / న్యూ ఢిల్లీ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఇప్పటికే అనేకసార్లు ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పర్యటనకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినా పర్యటనకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో పర్యటన వివరాలు ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :