Saturday, 26 September 2026 07:19:05 PM

ఆ కార్పొరేటర్ పంజరంలో చిలకా...⁉️

కోవర్టు రాజకీయాలకు ఆయన పెద్దకొడుకు...⁉️

Date : 24 February 2023 11:32 AM Views : 1476

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఓ కార్పొరేటర్ పంజరంలో చిలకల వ్యవహరిస్తూ, కోవర్టు రాజకీయాలకు పెద్దకొడుకుల మారాడని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ మాట్లాడుతూ... అభివృద్ధి చేయలేదని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు చౌరస్తాకు రండి ఎక్కడ ఏం అభివృద్ధి చేశామో చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళి స్వామి పంజరంలో చిలకల ఉంటూ కోవర్టు రాజకీయాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. మేయర్ పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని హైదరాబాద్ లో లాబీయింగ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కన్ సింగ్ వెంట ఉంటూ ఆయనకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరైంది కాదని మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్పొరేటర్ గా గెలిచాక భూములు కబ్జా చేసింది నిజం కాదా ప్రశ్నించారు. అలాగే చిట్టిల పేరుతో బినామీలను పెట్టి మోసం చేస్తే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే అప్పుడు ఎమ్మెల్యే వద్దకు వచ్చి బ్రతిమిలాడ లేదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కాన్ సింగ్ ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది పద్ధతి కాదని అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఏం చేశావో చెప్పాలని ప్రశ్నించారు. మక్కన్ సింగ్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అని ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాద్ కి వెళ్తాడని విమర్శించారు. ఇప్పటికైనా బిఆర్ ఎస్ పార్టీని విమర్శించడం మానుకోవాలని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :