Friday, 25 September 2026 04:56:55 PM

జగిత్యాల జిల్లాలో దొంగలు భీభత్సం

Date : 22 December 2022 01:29 PM Views : 538

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మెట్ పల్లిలో దొంగలు భీభత్సం సృష్టించారు..జాతీయ రహదారిపై ఉన్న 10 దుకాణాలలో దొంగతనాలకు పాల్పడ్డారు. సుమారుగా పది లక్షలకు పైగా నగదు పోయినట్టుగా సమాచారం. అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మెట్ పల్లి జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న దుకాణాలను, సంబంధిత యజమానులు ఎప్పటిలాగే రాత్రి మూసేసి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే చలికాలం కావడంతో రహదారి నిర్మానుష్యంగా మారింది. దీంతో ఇదే అదునుగా చేసుకున్న దొంగలు దుకాణాల తాళాలు పగలగొట్టి మరీ, అందులో దొరికినదంత దోచుకుపోయారు.ఈ విషయం కొందరు యజమానులకు ఉదయం వేళ విషయం తెలియడంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :