Saturday, 26 September 2026 07:23:20 AM

రామగుండం లో నాయకులు గ్రహణంలా పట్టుకున్నారు...

మీడియా సమావేశంలో కంటతడి పెట్టిన సంధ్యారాణి

Date : 03 October 2023 11:51 AM Views : 1634

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో కొంత మంది రాజకీయ నాయకులు నా ఎదుగుదలను చూడలేక రాజకీయ గ్రహణంలో పట్టుకున్నారని పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్యారాణి మాట్లాడుతూ... గత 30 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని మహిళలకు ఎక్కడా అవకాశం లేదని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆర్ఎఫ్ సీ ఎల్, మెడికల్ కళాశాలలో ఉద్యోగ దందా జోరుగా నడుస్తుందని ఆరోపించారు. ఇక్కడ గెలిచిన కొంతమంది నాయకులు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా నన్ను అనగదొక్కడానికి కౌశిక హరి, మక్కాన్ సింగ్, కోరుకంటి చందర్ లు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కోరుకంటి చందర్ కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడితే చందాలు వేసుకుని గెలిపించామని తెలిపారు. గతంలో మాజీ ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ గెలుపులో కూడా నా కృషి ఎంతో ఉందని అన్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ప్రకటనలు కాదు... మహిళలకు అవకాశం కల్పించడంలో ఆచరణలోకి తీసుకురావాలన్నారు. నాతోపాటు నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. వీడియో సమావేశంలో కంటతడి పెట్టిన సంధ్యారాణి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపిస్తున్నట్లు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :