Wednesday, 25 March 2026 02:42:59 PM

కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన...

కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం..

Date : 13 July 2023 01:20 PM Views : 599

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ లేబర్ గేటు వద్ద యునైటెడ్ ఫోరం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటి షిఫ్టు విధులు బహిష్కరించి కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కార్మికులు భిక్షటన చేపట్టారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని వారు హెచ్చరించారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్న 3500 మంది కాంట్రాక్టు కార్మికులు తమ జీతాలు పెరగాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన యాజమాన్యం మొండి వైఖరిని అవలంబిస్తుందని వారు మండిపడ్డారు.అలాగే యాజమాన్యం కార్మికుల సమస్యలను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ప్రమోషన్, ఐటి డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం సమస్యలు పరిష్కరించకపోతే నిరంతర కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. లేనియెడల కార్మిక కుటుంబాలతో కలిసి రోడ్డు ఎక్కుతామని వంట వార్పుతో పాటు బంద్ కు పిలుపునిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం దిగి రాకపోతే రెండు రోజుల సమ్మె పిలుపుతో పాటు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :