Friday, 25 September 2026 10:18:50 PM

మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు..బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ట్వీట్..

నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానాలనే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుంది...

Date : 06 February 2024 12:00 PM Views : 594

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, బాల్క సుమన్‌పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్ చేశారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందని ఆరోపించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.లేకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన తెలంగాణలో రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ ద్వారా విమర్శించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :