Friday, 21 March 2025 09:42:47 AM

రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డ మాజీ మంత్రి కెటిఆర్

Date : 07 February 2025 06:24 PM Views : 289

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి మాజీ మంత్రి కెటిఆర్ విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలతో అధికార పీఠమెక్కి.. రైతులను బలిపీఠం ఎక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 అబద్ధపు హామీలకు ఇప్పటివరకు 420 మంది రైతులు బలయ్యారని అన్నారు.ఈ మేరకు కెటిఆర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అసమర్థులు అధికార పీఠమెక్కడంతో తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. రుణమాఫీ, పెట్టుబడి సాయం అందించకపోవడం వల్లే ఈ అనర్థాలకు కారణమన్నారు. చలనం లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని సర్కారు వల్లే మళ్లీ తెలంగాణ పల్లె కన్నీరుపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీని ఆగం చేసి.. పెట్టుబడి సాయానికి పాతరేశారని విమర్శించారు. ఇకనైనా సాగు సంక్షోభాన్ని తీర్చి అన్నదాతల ఆత్మహత్యలను ఆపాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :