Friday, 25 September 2026 04:57:33 PM

తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు...

20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో...హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక

Date : 15 December 2023 07:40 PM Views : 409

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలను హైకోర్టుకు రిజిస్టార్ నివేదిక అందజేసింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయని వెల్లడించింది. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. 46 కేసులు ప్రజా ప్రతినిధులకు సమన్లు జారీ చేసే దశలో ఉన్నాయని వివరించింది. 10 కేసుల్లో ప్రజా ప్రతినిధుల కేసులపై స్టే ఉందని పేర్కొంది. కాగా ఈ రోజు (శుక్రవారం) నుంచి 2 నెలల లోపు విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హైకోర్ట్ ఆదేశించింది. సంబంధిత పోలీసులు 2 వారాల్లో సమన్లు జారీ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రయల్ దశలో ఉన్నాయని, వాటిని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.5 కేసుల్లో వెంటనే ప్రజా ప్రతినిధుల కేసులపై ఛార్జ్‌షీట్ నంబర్లు దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. మూడు నెలల లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సమర్పించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :