Thursday, 25 June 2026 06:44:30 PM

ఎన్నికల వేళ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..

అసత్య ప్రచారాలను నమ్మవద్దు.... సోమారపు సత్యనారాయణ

Date : 23 October 2023 08:07 PM Views : 1803

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఎన్నికల వేళ కావాలనే ప్రజలను అయోమయానికి గురి చేయడానికి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కోరారు. ప్రజల "ఆకాంక్ష" మేరకు చివరిసారిగా ఈ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నాకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని "ఆకాంక్ష" న్యూస్ కు సోమారపు సత్యనారాయణ తెలిపారు. గతంలో నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని, ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలవేళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను చేసి మభ్య పెట్టాలను కోవడం సాధ్యం కాదన్నారు.. పూర్తిస్థాయి కార్యాచరణతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు.ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు, వ్యాపారులకు, కార్మికులకు, కర్షకులకు, అన్ని వర్గాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :