ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా 100 మంది బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే, తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని, కాకపోతే విచారణను మాత్రం కొనసాగించవచ్చని కోర్టు వెల్లడించింది.
Admin
Aakanksha News