Saturday, 08 August 2026 06:48:24 AM

బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం

Date : 11 March 2023 07:00 PM Views : 332

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం రాజీవ్ రాహదారి వద్ద బిజెపి ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మను మండల బీఆర్ఎస్ నాయకులు దగ్దం చేశారు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని మల్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన హోదా ఏంటో తెలియకుండా మతిభ్రమించి మాట్లాడుతున్నాడని వారు మండి పడ్డారు.జాతీయ పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశం కోసం ధర్మం కోసం హిందువులని మాట్లాడతావు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే గ్రామ గ్రామాన నిరసనలు చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడి, సిబిఐ చట్టబద్ధంగా చేసే సంస్థలను కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థలుగా మారియని విమర్శించారు. దేశంలోనీ రాష్ట్రలలో బిజెపి లేని రాష్ట్రాలలో ఈడి సిబిఐల పేరుతో దాడులు చేపిస్తున్నారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగం శ్రీనివాస్ జెడ్పిటిసి రామ్మోహన్ రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల సుదర్శన్, చైర్మన్ మధుసూదన్ రావు, మాజీ ఎంపీపీ ఎడిపల్లి అశోక్,తదితరుల పాల్గోన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :