Saturday, 18 January 2025 10:36:24 AM

లొట్ట‌పీస్ ముఖ్య‌మంత్రి...

బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్క‌ర‌ణ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Date : 08 January 2025 03:01 PM Views : 291

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఏసీబీ కేసు లొట్ట‌పీస్ కేసు.. లొట్ట‌పీస్ ముఖ్య‌మంత్రి అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్క‌ర‌ణలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఉన్న ఇబ్బందుల‌తో పోల్చితే.. ఇది అసలు ఇబ్బందే కాదని..ముఖ్య‌మంత్రి.. చేయ‌గ‌లిగేదేమీ లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ క‌డుపు మాడ్చుకొని తెలంగాణ వ‌చ్చుడో.. కేసీఆర్ స‌చ్చుడో.. తెలంగాణ జైత్ర‌యాత్ర‌నో.. కేసీఆర్ శ‌వ‌యాత్ర‌నో అని కూర్చున్న సమయంలో లేని ఇబ్బంది ముందు ఈకేసు ఎంత అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో యాద‌య్య‌, శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకుని భ‌గ‌భ‌గ‌ మండుతుంటే వాళ్ళు పడిన ఇబ్బంది ముందు ఇది ఏం ఇబ్బంది అని అన్నారు.ఓయూలో బాల్క సుమ‌న్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు ప‌లువురి విద్యార్థి నేత‌ల‌ మీద విరిగిన లాఠీల కంటే ఇదేమి నాకు ఇబ్బంది కాదని ఇది లొట్ట‌పీస్ కేసు అని కేటీఆర్ తేల్చిచెప్పారు.తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసి చావునోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ తెచ్చిన నాయ‌కుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ త‌యారు చేసిన సైనికుడిగా , కేసీఆర్ ర‌క్తం పంచుకుపుట్టిన బిడ్డ‌గా ఇది ఇబ్బంది కానే కాదు. ఎవ‌రూ ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు