Tuesday, 11 August 2026 01:42:45 PM

ముస్తాబాద్‌లో అరుదైన ఘటన

ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం..

Date : 28 March 2023 03:02 PM Views : 889

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాన్పు కోసం చేరిన ఓ మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గంభీరావుపేట మం. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టుముక్కల లావణ్య కాన్పు కోసం ముస్తాబాద్ పీపుల్స్ ఆస్పత్రిలో చేరారు. ఇది ఆమెకు రెండో కాన్పు. మొదటి కాన్పులో బాబుకు 9 ఏళ్లు ఉండగా రెండో కాన్పులో బాబు, తరువాత పాప, అనంతరం మరో ఇద్దరు బాబులు జన్మించారు.వీరికి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :