ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ జిల్లా : మోటర్ వైండింగ్ మెకానిక్ ల భద్రతే తమ సంఘం ప్రధాన కర్తవ్యం అని తెలంగాణ యునైటెడ్ మోటర్ వైండింగ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కాయితోజు పవన్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో జరిగిన సిఆర్ఐ మెకానిక్ ఆత్మీయ సమ్మేళనంలో మోటర్ మెకానిక్ లకు సుమారు 400 మందికి ఫ్రీగా ఇన్సూరెన్స్ బాండ్లు, మరియు 250 డిజిటల్ క్లాంప్ మీటర్ లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. కరెంట్ మోటర్ వైండింగ్ మెకానిక్ లు తరుచు ఏదో ఒక ప్రమాదాలకు గురి అవుతుంటారని అలాంటి వారి కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కాయితోజు పవన్ కుమార్. మెకానిక్ ల సౌభాగ్యమే తమకు ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మెకానిక్ లతో పాటు సీనియర్ మోటార్ మెకానిక్ హనుమంత్ రెడ్డి, గంగాధర్, సిఆర్ఐ కంపెనీ ప్రతినిధులు డిజిఎం మధుసూదన్, బ్రాంచ్ మేనేజర్ కీర్తి శ్రీనివాస్, సర్వీసింగ్ ఇంజనీర్ కన్నన్, పరమేశ్వర ఏజెన్సీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News