Monday, 16 February 2026 03:11:16 AM

భక్తాంజనేయ స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం...

Date : 15 February 2026 11:55 PM Views : 81

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని పట్టణంలోని కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేద పండితుల సాక్షిగా ప్రధాన పూజారి బూర్ల గణేష్ తో పాటు రాయమల్లు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శివపార్వతులను వారి వారి కుటుంబాలను చల్లంగా చూడాలని పిల్లలను వారి గ్రామాలను వారున్న ఊర్లను పాలిస్తున్న పాలకులను చల్లంగా చూడాలని వేడుకున్నారు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా చావదు అనే ప్రకారం శివపార్వతులకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ దాట్ల జేమ్స్ రెడ్డి ఆకాంక్ష చీఫ్ ఎడిటర్ పాల్గొన్నారు వారితోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :