ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఈ నెల 4 న సా.4గం.లకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే పుస్తకాల ఆవిష్కరణ సభను జయప్రదం చేయాల్సిందిగా అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ,బివివి ట్రస్టు నిర్వాహకులు వై.యాకయ్య,జర్నలిస్ట్ మాదాసీ రామమూర్తి,అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేశ్ లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అస్పృశ్యత జీవితం ఆధారంగా కార్మిక నాయకుడు బిక్ష్మయ్యపై ప్రముఖ రచయిత కాలువ మల్లయ్య రాసిన అస్పృశ్య యోధుడు నవలను,లాల్,నీల్ ఐక్యత నేపథ్యంలో పలువురు ప్రముఖులతో బొజ్జ బిక్ష్మయ్య చేసిన టీవీ ఇంటర్వ్యూల సంపుటి బుద్ధుడు నుంచి గద్దర్ వరకు పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు.రామగుండం ఎమ్మల్యే మక్కాన్ సింగ్ రాజఠాకూర్ ముఖ్యఅతిథిగా, విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మినిమమ్ వేజ్ కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్,అరసం రాష్ట్ర అధ్యక్షులు పల్లేరు వీరస్వామి,సింగరేణి ఏఐటీయూసి, సిఐటీయు,టీబీజీకేఎస్ అధ్యక్షులు వి.సీతారామయ్య,టి.రాజిరెడ్డి, మిర్యాల రాజిరెడ్డిలు హాజరవుతారని అన్నారు.పుస్తకాల రచయితలు కాలువ మల్లయ్య,బిక్ష్మయ్యల స్పందన తెలుపుతారని వివరించారు. ఈ సమావేశంలో ట్రస్టు నిర్వాహకులు రాజు సాగర్ తేజ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Aakanksha News