ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి,రామగుండం బీజేపీ ఇంచార్జీ కందుల సంధ్యరాణి కలసి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు విద్యాసంస్థలను సందర్శించి ఉపాధ్యాయులను పట్టభద్రుల ఎన్నికలకి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని స్పెక్ట్రా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శ్రీరామ విద్యానికేతన్, శ్రీ చైతన్య హై స్కూల్ (అడ్డగుంటపల్లి) శ్రీ చైతన్య టెక్నో స్కూల్ (ఆర్.ఎఫ్.సి.ఎల్),కాకతీయ కళాశాలను సందర్శించారు..డిసెంబర్ 9 చివరి తేదీ అని గుర్తుచేస్తూ..అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు, పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఓటు నమోదు ప్రాముఖ్యత గురించి బీజేపీ నేతలు ఉపాధ్యాయులకు వివరించారు. వారు పట్టభద్రుల ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా వారి హక్కులు కాపాడుకోవడానికి మరియు భవిష్యత్తుకు భద్రత ఉంటుందన్నారు.ఓటు నమోదు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఎలా సమర్పించుకోవాలి, ఏ కాగితాలు అవసరమవుతాయి, వివరాలను ఎక్కడ సమర్పించవచ్చో ఈ సందర్భంగా తెలియజేశారు.ఉపాధ్యాయులు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజేపి పార్టీ మడల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య,మిట్టపల్లి సతీష్,బాణాల స్వామి మరియు బిజేపి సీనియర్ నాయకులు కోమల మహేష్, కొండపర్తి సంజీవ్,బొడ్డుపల్లి రంజీత్ జక్కుల ప్రవీణ్ పద్మ ,అపర్ణ తదితరులు పాల్గొన్నారు.అనంతరం కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులకు, సిబ్బందికి బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Aakanksha News