Friday, 26 June 2026 01:14:49 AM

సింగరేణి వ్యాప్తంగా సమ్మె పోరాటానికైనా సిద్ధంగా ఉండండి...

దశలవారి ఆందోళన కార్యక్రమాల కరపత్రం ఆవిష్కరణ...

Date : 24 November 2024 03:17 PM Views : 368

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా సమ్మె పోరాటానికైనా సిద్ధం కావాలని PSCWU TUCI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ TUCI రామగుండం రీజియన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంపుదల చేయలేదన్నారు. నిడదవోలులో వేతనాలు పెంచుతామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది గడిచిన అతి గతి లేదని ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణిలో కార్మిక చట్టాల ఉల్లంఘన యదేచ్చగా కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతో లాభాలను అర్జీస్తున్న సింగరేణి యాజమాన్యం వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా వైపల్యం చెందిందన్నారు. ఈ స్థితిలో సింగరేణి వ్యాప్తంగా మరోసారి ఉద్యమించాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గం పిలుపులో భాగంగా నవంబర్ 24 నుండి డిసెంబర్ 10 వరకు సింగరేణి వ్యాప్తంగా దశలవారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేతనాలు పెంచేదాకా కాంట్రాక్టు కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని సమ్మె కైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో TUCI రాష్ట్ర నాయకులు జిల్లా రాంప్రసాద్, మాస్లైన్ జిల్లా కమిటీ సభ్యులు గూడూరు వైకుంఠం, ఇనగాల రాజేశ్వర్ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు కొయ్యడ శంకర్, మాట్ల సమ్మయ్య, కొయ్యడ వెంకటేష్,పులిపాక రాజేందర్, గొట్టే లక్ష్మీనారాయణ, గుండ్ల పోషం, కలవల రాయమల్లు, ఆడేపు శంకర్, తూల్ల శంకర్ పి సదానందం, మాటేటి పోశం, గుమ్మడి వెంకన్న, బొడ్డు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :