Saturday, 08 August 2026 10:28:55 AM

అర్హులకు న్యాయం చేయాలి...

Date : 24 September 2024 04:38 PM Views : 344

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : గ్రీన్ ఫీల్డ్ లో భాగంగా మంథని మండలం పుట్టపాకలో అర్హులకు న్యాయం జరగడం లేదని, అర్హులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పుట్టపాక మాజీ ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. మంథని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టపాకలో అధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేయకుండానే అర్హులకు అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. పుట్టపాక గ్రామంలో నామమాత్రం బోరు బావుల కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి సంవత్సరాలుగా ఉన్న పాత బోరుబావులకు తక్కువ మొత్తంలో అధికారులు డబ్బులు చెల్లించారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా గతంలో మహబూబ్ పల్లి పుట్టపాక రైతులకు ప్రభుత్వ భూములు ఇచ్చినప్పటికీ వారికి కాకుండా అధికారులు అనర్హుల పేర్లు గెజిట్లో పెట్టి వారికి డబ్బులు చెల్లించారని ఆరోపించారు. అర్హులైన వారికి న్యాయం చేయకుండా అనర్హుల తో అధికారులు కుమ్మక్కై వారికి డబ్బులు చెల్లించాలని అన్నారు. ఇప్పటికైనా జిల్లా పరిపాలన అధికారి పూర్తిస్థాయిలో విచారణ చేయించి అర్హులైన వారికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోకల వినోద్ కుమార్, కన్నూరు మల్లయ్య, నవుళ్ళ ఓదేలు వట్కాపురం గట్టయ్య, నక్క రమేష్ ,తోకల లక్ష్మణ్, వట్కాపురం పోషాలు, మంథని పోషం, ఏట సుగుణ, తోకల మల్లేష్, మంథని పోశం, స్వామి, కన్నూరి సదానందం, వట్కాపురం చంద్రయ్య, వట్కాపురం సద్దయ్య లు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :