ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని మండలం చిన్న ఓదాల గ్రామానికి చెందిన లెంకల చెంద్రయ్య, సుంకరి రమేష్ లకు చెందిన రెండు బర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. ఆదివారం ఉదయం మేతకు వెళ్లిన బర్రెలు విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని రైతులు వాపోయారు. పాడి గేదెలు మృతి చెందడంతో ఒక్కో రైతు సుమారు రూ. 50 వేల వరకు నష్టపోయారని, బాదితులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మోతుకు రాజబాబుతో పాటు గ్రామస్తులు కోరారు.
Admin
Aakanksha News