Saturday, 26 September 2026 04:10:50 AM

420 హామీలు… 420 అబద్ధాలు... కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేస్తాం..

కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తాం... మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 05 October 2025 11:42 AM Views : 328

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖని తిలక్ నగర్ డౌన్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరీ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆయన విమర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, “అభయహస్తం పేరుతో ఇంటింటికీ తిరిగి సంతకాలు తీసుకొని ప్రజలను నమ్మబలికించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను మోసం చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమం ప్రారంభమైందని, త్వరలోనే రామగుండం నియోజకవర్గంలోని 60 డివిజన్లు, 28 గ్రామాల్లో “కాంగ్రెస్ బాకీ కార్డు”లను పంపిణీ చేసి పార్టీ అబద్ధపు హామీలను ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కోసం ఎవరైనా కాంగ్రెస్ నాయకులు వస్తే, కాంగ్రెస్ బాకీ కార్డుపై నిలదీయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమాధానం చెప్పాలని చందర్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే ‘420 హామీలు… 420 అబద్ధాలు…’ అని విమర్శించిన ఆయన, ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. “సొమ్ము ఒక్కడిది, సోకు ఒక్కడిది అన్నట్లు రామగుండం నియోజకవర్గంలో కొంత మంది నాయకులు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు.నియోజకవర్గంలో వీళ్లకు కులగొట్టడం తప్ప వాళ్లకు ఇంకేమీ రాదని” చందర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, త్వరలోనే ఈ ప్రభుత్వంకు ప్రజలు బుద్ది చెప్పే సమయం వస్తుందన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో కౌశిక హరి మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,చెపకలపల్లి శ్రీనివాస్,మేతుకు దేవరాజ్ నారాయణదాసు మారుతి,బొడ్డు రవీందర్, బోడ్డుపల్లి శ్రీనివాస్, నీరటి శ్రీనివాస్, మేడి సదానందం, బుర్ర వెంకటేష్, ఇరుగురాళ్ల శ్రావన్, కొడి రామకృష్ణ సారయ్య నాయక్ కర్రీ ఓదేలు ముద్దసాని సంధ్యా రెడ్డి,దొమ్మేటి వాసు సట్టు శ్రీనివాస్ కనకలక్ష్మి గుర్రం పద్మ రామరాజు,బోడ్డుపల్లి శ్రీనివాస్ ఇంజపురి నవీన్ కుమార్,బోడ్డుపల్లి శ్రీనివాస్ ఇంజపురి నవీన్ కుమార్,చింటూ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :