Friday, 26 June 2026 01:22:04 AM

రాజీవ్‌ యువ వికాసం ద్వారా మైనారిటీ క్రైస్తవ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు..

ఈ నెల 14 లోపు రాజీవ్‌ యువ వికాసం పథకంకు దరఖాస్తులు చేసుకోవాలి....... పెద్దపల్లి జిల్లా ఇంటర్‌ డినామినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు పాస్టర్‌ ఎం.మహిపాల్‌ రెడ్డి

Date : 07 April 2025 08:41 PM Views : 428

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : తెలంగాణ క్రిస్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా క్రైస్తవ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాజీవ్‌ యువ వికాసం పథకం ప్రారంభించబడిరదని పెద్దపల్లి జిల్లా ఇంటర్‌`డినామినేషనల్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు పాస్టర్‌ ఎం.మహిపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాస్టర్‌ పి.డిలైట్‌ తెలిపారు. ఈ పథకానికి ఈ నెల 14లోపు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉందని తెలిపారు. గోదావరిఖనిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీస్‌ చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు. ఆధార్‌ కార్డ్‌, రేషన్‌ కార్డ్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటో, స్టడీ సర్టిఫికెట్‌, మొబైల్‌ నెంబర్‌, రవాణా రంగ పథకాల కోసం శాశ్వత డ్రైవింగ్‌ ల్కెసెన్స్‌, వ్యవసాయ పథకాల కోసం పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌, హనీ కలిగించే సమూహ ధృవీకరణ పత్రాలతో ఆన్‌ లైన్‌ నందు దరఖాస్తుల సమర్పించాలని అన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 55 సంవత్సరాల వయసు గల వారు, వ్యవసాయ అనుబంధ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల వయసు గల వారు అర్హులని, మీరు ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 50 వేల రూపాయల, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల లోపు ఉండాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా మైనారిటీ కార్పోరేషన్‌ ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులని తెలిపారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద మైనారిటీ నిరుద్యోగులను స్వయం ఉపాధి పథకాలు అందించడానికి ఈ ప్రణాళిక ఆమోదించిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల నిరుద్యోగ మైనారిటీ యువత ఆన్‌ లైన్‌ పోర్టల్‌ వెబ్‌ సైట్‌ లేదా సంబంధిత మండల ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాలలో మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన క్రైస్తవులకు గరిష్టంగా రూ.4లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుందని, సహాయం కింద 70 నుంచి వంద శాతం సబ్సిడీ అందించబడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని క్రైస్తవలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాస్టర్‌ బి.రవి పాల్‌, సంయుక్త కార్యదర్శి పాస్టర్‌ జె.ప్రజార్షి, ఉపకోశాధికారి పాస్టర్‌ డి.గాబ్రియేల్‌, కార్యనిర్వాహక సభ్యులు పాస్టర్‌ రవి వర్మ, పాస్టర్‌ ఈ.థామస్‌, పాస్టర్‌ చందర్‌ పాల్‌, పాస్టర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :