Sunday, 27 September 2026 05:22:25 AM

15 రోజుల ముందే వార్షిక బొగ్గు ఉత్పత్తిని సాధించిన ఓసీపీ-5

Date : 16 March 2025 02:34 PM Views : 429

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అనుకున్న సమయం కంటే ముందే వార్షిక బొగ్గు ఉత్పత్తిని సాధించి ప్రత్యేకతను చాటుకున్నారు. 2024-2025 ఓసీపీ-5 వార్షిక లక్ష్యం 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 15 రోజుల ముందుగానే సాధించినందుకు ఓసిపి 5 అధికారులకు సూపర్వైజర్లకు కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మడ్డి ఎల్లా గౌడ్ సెంట్రల్ సెక్రటరీ కే స్వామి బ్రాంచ్ సెక్రటరీ ఆరెళ్ళిపోశం, రంగు శీను మాదన మహేష్ పిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్ మరియు ఓసీపీ5 ఫిట్ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. అర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కి, ప్రాజెక్టు ఆఫీసర్ చంద్రశేఖర్, ఎస్ ఓ యం రమేష్ బాబు, గని మేనేజర్ అనిల్ గబాలె ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :