ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రామగుండంలోని సింధూర ఇంజనీరింగ్ కళాశాల నుంచి 20 లక్షల 24 వేల 140 రూపాయలను వసూలు చేయడం జరిగిందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.రామగుండం కార్పొరేషన్ లో ఉన్న సింధూర ఇంజనీరింగ్ కళాశాల ఆస్తి పన్ను గత 5 సంవత్సరాల నుండి చెల్లించని కారణంగా రామగుండం మున్సిపల్ కమిషనర్ ద్వారా వచ్చిన దరఖాస్తుకు రామగుండం తహసీల్దార్ కుమార స్వామి ద్వారా సంబంధిత కళాశాల ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి, ఆస్తి పన్ను చెల్లించని పక్షంలో రెవెన్యూ శాఖ ఆస్తి నీ స్వాధీనం చేసుకుని వేలం నిర్వహిస్తుందని నోటీసులు జారీ చేయడంతో సింధూర ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు బకాయిలో ఉన్న ఆస్తిపన్ను 20 లక్షల 24 వేల రూపాయలను బుధవారం చెల్లించడం జరిగిందని తెలిపారు.ఇదే విదంగా ఇంకో (9) మంది రామగుండం కార్పొరేషన్ కి ఆస్తి పన్ను బకాయి ఉన్నారని వారికి కూడా తహసీల్దార్ రామగుండం నోటీసులు జారీ చేశారని వారు కూడ చెల్లించని పక్షంలో చట్ట ప్రకారం వారి ఆస్తులను రెవిన్యూ శాఖ ద్వారా స్వాధీన పర్చుకుని వేలం ద్వారా బకాయిలు వసూలు చెయ్యడం జరుగుతుందన్నారు.ఈ 9 మందిలో ఒక సినిమా థియేటర్ యజమాని హైకోర్టు నూ ఆశ్రయించి స్టే పొందేందుకు ప్రయత్నం చేసినప్పటికీ సకాలంలో తహసిల్దార్ రామగుండం హైకోర్టులో కౌంటర్ దాఖలు పర్చి వారికి స్టే రాకుండా కూడా అడ్డుకోవడం జరిగిందని అన్నారు. వారి వివరాలు 1.దేవప్ప కవిత టాకీస్ 3448763/- ఆస్తి పన్ను, 2.లోటస్ ఎంబీఏ కళాశాల 1467845/- రూపాయల ఆస్తి పన్ను, 3.నారాయణ సురేందర్ రెడ్డి రామిరెడ్డి గురువారెడ్డి 2407960 4. వీరాంజనేయ ఇండస్ట్రీస్ 1840006/- రూపాయల, 5.ఫణి జూనియర్ కళాశాల 900013/- 6. ముక్క నరసింహమూర్తి 2543229/- 7.సదానందం థియేటర్ 360947/- రూపాయల, 8.1167350/- రూపాయల, 9. కాసరి పాపయ్య 258546/-రూపాయల ఆస్తి పన్ను దీర్ఘ కాలికంగా జిల్లాలో వివిధ స్థానిక సంస్థలకు ఆస్తి పన్ను బకాయి ఉన్నాయని అన్నారు.ఆస్తి పన్ను బకాయి ఉన్నవారు వీలైనంత త్వరగా చెల్లించగలరని లేనిచో అందరిపై ఇలాగే రెవిన్యూ రికవరీ చట్టం ద్వారా పన్ను బకాయిలను వసూలు చేసేందుకు తహసిల్దార్ లను రంగంలోకి దించుతనని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
Aakanksha News