Friday, 26 June 2026 01:22:52 AM

ఈ ఊరు సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే వచ్చావా...? రామగుండం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ధ్వజం....

1టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి రెజైన్ ఇచ్చి మక్కాన్ సింగ్ సైన్యంలో చేరండి,

Date : 04 November 2025 02:11 PM Views : 960

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం ఈ ఊరు సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే వచ్చావా... ప్రజాస్వామ్య పద్ధతిలో బలహీన పరిస్థితుల్లో ఓటేసి గెలిపించిన ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సోమవారం హనుమాన్ నగర్ లో రేడియం శ్రీనుపై జరిగిన దౌర్జన్యానికి సంబంధించి శ్రీ నన్ను కలిసి అడిగి పరామర్శించారు. అనంతరం కౌశిక హరి మీడియాతో మాట్లాడుతూ....1టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చేసిన దౌర్జన్యాన్ని కఠినంగా ఖండిస్తున్నామని అన్నారు. మీరు ఎవరో ఆజ్ఞలకు ఇలా చేయడం సరైనది కాదని తెలిపారు. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు. అధికారులుగా వ్యవహరించే వారు లేరు. కేవలం ఒక గూటి శక్తులదే నిర్ణయాలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికైతే పోలీస్ అధికారులు 1టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రెజైన్ ఇచ్చి మక్కాన్ సింగ్ సైన్యంలో చేరండి, లేకపోతే మక్కాన్ సింగ్ సేవా సమితిలో అయిన చేరండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి కార్పొరేటర్‌గా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయండి, మాకు వ్యతిరేకత, అభ్యంతరం కానీ లేదు. ప్రజా కోర్టులో మీరు చేసే పని ప్రజా కోపం విచ్ఛిన్నంగా వినిపించింది.గోదావరిఖని చౌరస్తా నుంచి న్యూ అశోక్ థియేటర్ వరకు రూట్ మ్యాప్, రోడ్డు వెడల్పు గురించి సరైన ప్రణాళిక లేకుండా మార్పులు చేయడం ట్రాఫిక్ సమస్యలను, భద్రతా అంశాలను భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిసిన ఎందుకు సమస్య పరిష్కారానికి దారి చూపడం లేదని కౌశిక హరి ప్రశ్నించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న అభివృద్ధి నమూనాను రామగుండంలో తక్షణమే వర్తింప చేయాలనుకోవడం సాధ్యం కాదని తెలిసిన సరైన ప్రణాళిక లేకుండా చేయడం సాధ్యం కాదని తెలిసిన ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.సింగరేణి మున్సిపాలిటీ పరిధిలో ఎవరు, ఎటువంటి కూల్చివేతలు, పునర్నిర్మాణాలు జరుపుతున్నారో స్పష్టత లేదని సాధారణ ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పొద్దైతే ఒకరు వస్తాడు, సాయంత్రం మరొకరు వస్తాడు. బ్లాక్ మెయిల్, ఒత్తిడి ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారని అన్నారు.గోదావరిఖని చౌరస్తా నుంచి న్యూ అశోక థియేటర్ వైపు రోడ్డు వెడల్పు ఎంత వరకు ఉండాలో ప్రణాళిక చేసుకొని రూట్ మ్యాప్ సరిదిద్దుకోవాలి. గ్రేటర్‌లో ఉన్నట్టు ప్రతిదీ ఇక్కడా సాధ్యం కాదు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన విమర్శించారు.ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా సింగరేణి మున్సిపాలిటీ కూలగొట్టడాలు చేస్తున్నారు. అసలు కూల్చే అధికారం వీరికి ఎక్కడిది? వీటన్నిటికీ పట్టాలు ఉన్నాయి. ఉదయం ఒకరు వస్తారు బ్లాక్‌మెయిల్ చేస్తారు, సాయంత్రం మరొకరు బాయ్‌తో మాట్లాడమంటారు. కాలవాలని అంటారు. ఇది ఎక్కడి వ్యవస్థ?” అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌కు దమ్ము లేదు. పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులను వాడుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓసీపీ-5, బూడిద, ఎస్సిఆర్ రోడ్డు, మట్టి మీద డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు.అలాగే ప్రభుత్వ సంస్థల్లో అవినీతి, ఉద్యోగాల అమ్మకాలపై ఘాటుగా స్పందించారు. ఎన్టీపీసీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఎవరి ఆధ్వర్యంలో అమ్ముకుంటున్నారు..? నువ్వు వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా..? ఎంత మంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీ సొంత నాయకులకు కూడా ఉపాధి చూపించలేకపోయావు అని ఎమ్మెల్యే తీరుపై కౌశికహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక్కడ అధికారులు ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారని చట్టబద్ధత లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని. భవిష్యత్తు తరాలకు ప్రమాదం ఏర్పడుతోందని ఆయన ఆవేదన తెలిపారు.ఇకనైనా అధికారులు ప్రజలతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమానికి దిగుతుందని హెచ్చరిక జారీ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :