Saturday, 26 September 2026 04:09:08 AM

ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలి....

మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ....

Date : 27 February 2025 12:11 AM Views : 745

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో కుటుంబ సభ్యులతో కలసి పూజలు నిర్వహిస్తున్న క్రమంలో ఆస్పత్రిలో చేరిన వారు కూడా ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో జీవించాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ కిరణ్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ... పండుగ అంటే మనం మాత్రమే జరుపుకునేది కాదు అని అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లినప్పుడే సుభిక్షంగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని పలువురు ఆకాంక్షించారు. ఎన్నో సమస్యలతో ఆసుపత్రిలో చేరిన వారు త్వరగా కోలుకొని తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని మహాశివరాత్రి సందర్భంగా శివుడిని ప్రార్థించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :