Saturday, 26 September 2026 04:10:49 AM

గ్రామపంచాయతీ సపాయి సిబ్బంది విధి నిర్వర్తనలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి...

Date : 20 September 2025 06:30 PM Views : 373

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో శనివారం స్వచ్ఛతా హీ సేవ-2025 కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్ (ఎంపీడబ్ల్యూస్) కోసం వైద్య శిబిరం నిర్వహించారు. కొలనూర్ ప్రభుత్వ దావఖానలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఎంపీడబ్ల్యూస్ కు బీపీ, షుగర్, రక్తపరీక్షలు చేశారు.ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ సంజనేష్ కుమార్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ సపాయి సిబ్బంది విధి నిర్వర్తనలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పనిలో అలసట, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ దావఖానలో వైద్యులు సంప్రదించాలని ఆయన స్పష్టం చేశారు.కొలనూర్ పీహెచ్సీ పరిధిలోని 9 గ్రామపంచాయతీలకు చెందిన మల్టీ పర్పస్ వర్కర్లు ఈ మెడికల్ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి షబ్బీర్ పాషా, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్, హెచ్ఈఓ శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :