Friday, 11 July 2025 04:28:02 AM

ప్రధాని మోడీ పదకొండు సంవత్సరాల పరిపాలన పురస్కరించుకుని మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

Date : 11 June 2025 06:42 AM Views : 202

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రధానిగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి ఆదేశాల ప్రకారం, మంగళవారం రోజు ఓదెలలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో, అలాగే మధున పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి బీజేపీ సీనియర్ నేత క్రాంతి గారు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఈ వృక్షారోపణ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేవైఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్, దాత రాకేష్, అనిల్ రావు, తీర్థలా కుమార్ స్వామి, కారంగుల నవీన్, ఆది సతీష్, బిక్షపతి, తుడి రాజేందర్, సత్యనారాయణ, ముత్యాల సంతోష్, లింగాల గోపాల్ రెడ్డి, చర్లపల్లి రాజు, రామినేని రాజేంద్రప్రసాద్, గతం సాయి తదితరులు పాల్గొన్నారు.పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రధాని మోడీ అభివృద్ధి యాత్రను స్మరించుకునే విధంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందనను పొందింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :