Wednesday, 23 September 2026 03:22:56 AM

చట్టం ముందు అందరూ సమానమే...

Date : 23 September 2024 06:23 PM Views : 359

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : చట్టం ముందు అందరూ సమానమేనని తప్పు చేసిన వారు శిక్షార్హులు అవుతారని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఆయిల్ ప్రసాద్ అన్నారు. సోమవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయిలి ప్రసాద్ మాట్లాడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టం శిక్షిస్తుందని, ఇనుముల సతీష్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాదన్న సంగతి గుర్తెరగాలన్నారు. మీరు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఇనుముల సతీష్ వ్యవహారం గురించి పార్టీ పెద్దలకు లేఖ రాయడం జరిగిందని ఏ చర్య తీసుకోవాలనేది పార్టీ త్వరలోనే నిర్ణయిస్తుందన్నారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న పుట్ట మధును పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలపాలని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో అనేక హత్యలకు, అక్రమ వాసుళ్లకు పాల్పడింది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్ట మధు, వారి అనుచరులెనని వారు ఆరోపించారు. ఈ సమావేశం లో జనగామ నర్సింగరావు, నూకల బానయ్య, మంథని సత్యం, పొలు శివ, కుడుదుల వెంకన్న, ఎరుకల ప్రవీణ్, సాధుల శ్రీకాంత్, అజీమ్ ఖాన్, రాం రాజశేఖర్, ఎరుకల మధు, పెండ్రి ప్రభాకర్ రెడ్డి, రోడ్డా రాజేశ్వర్,తల్లపల్లి సత్యనారాయణ, జనగామ సడవళి, నరెడ్ల ఓదెలు, ఎరుకల సురేష్, మిట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :