Saturday, 26 September 2026 05:58:36 AM

అంగరంగ వైభవంగా శివుని కల్యాణ రుద్రాభిషేకం...

Date : 26 February 2025 11:59 PM Views : 725

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని కాకతీయ నగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివుని కళ్యాణం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన పూజారి బూర్ల గణేష్, బండారి రాయమల్లు పాల్గొని ఇతర వేద పండితుల మధ్య శివుని కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ శివోహం అనే నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శివపార్వతులు గంగాదేవి ఆయా కుటుంబాలను తమ ఊర్లను పాలిస్తున్న పాలకులను చల్లంగా చూసి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తమకు వారి కుటుంబ సభ్యులకు కలగాలని భక్తులు కోరుకున్నారు. శివుని కళ్యాణ ప్రత్యేకతలను ఆలయ ప్రధాన పూజారిలు భక్తులకు వివరించారు. భక్తులకు అర్థమయ్యే రీతిలో చక్కగా మంత్రాలు చదువుతూ వేదమంత్రాలతో శివ కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఆకాంక్ష చీఫ్ ఎడిటర్ దాట్ల జేమ్స్ రెడ్డితో పాటు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :