ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగిరి మండలం బేగంపేట క్రాస్ రోడ్ వద్ద విశ్వ విజ్ఞాన్ వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజర్ మల్లెపల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ కంట్రీ ప్రోగ్రాంలో భాగంగా అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు అవగాహనతో ఏర్పాటు చేసిన కరపత్రాలను దుకాణ సముదాయాల్లో పంపిణి చేశారు. నేటి సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, చిన్న పిల్లలు కూడా మత్తు పదార్థాలకు బానిస అవుతూ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. సిగరెట్ త్రాగడం వలన పిల్లల్లో కలిగే మార్పులు పట్ల వారిని గుర్తించి వారిని చిన్న పిల్లలుగా ఉన్నపుడే కౌన్సెలింగ్ ద్వారా మాన్పించే ప్రయత్నం చేయవచ్చని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి తాగే వారి సంఖ్య పెరుగుతుందని, దాని వలన పిల్లల్లో పెద్దవాళ్ళలో చిరాకు, ఏకాగ్రత లేకపోవడం చిన్న విషయాలకి ఇతరుల మీద ఆధారపడటం ప్రతి దానికీ డల్ గా అవడం నిద్రలేమి ఆందోళన నిలకడగా ఒక్కదగ్గర సరిగా ఉండకపోవడం వీటిని భరించలేక మత్తుకు బానిస అవడం లాంటివి జరుగుతుంటాయని అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే మత్తు పదార్థాల వంటి వాటికి అలవాటు కాకుండా చూడవచ్చని సొసైటీ వ్యవస్థాపకులు మల్లారపు అరుణ్ కుమార్ పేర్కొన్నారు. అలాగే మత్తు పదార్థాలకు బానిస అవడం వలన గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉపాధి అవకాశాలు కోల్పోతు జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని గుర్తించి వారికి మాన్పించే ప్రయత్నాలు చేయాలని గాండ్ల మోహన్ కోరారు. ఈ కార్యక్రమంలో తీగల శ్రీనివాస్, ఎరుకల రాజశేఖర్, శనిగరపు హర్ష వర్ధన్, సానమల్ల వినయ్, సాయురామ్ గౌడ్, కొవ్వూరి శ్రీనివాస్, గద్దల లక్ష్మీనారాయణ, కోవ్వూరి దుర్గ ప్రసాద్, గుర్రం ఫ్రాన్సిస్, మేడ వినయ్, ఎం.డి.సైఫ్, కోవ్వూరి అశ్విత్, సంకే రిషి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News