Friday, 26 June 2026 12:19:11 AM

రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట...

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.

Date : 23 March 2025 06:36 PM Views : 445

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 130 వ మహాజనసభకు ముఖ్యఅతిధిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేసి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. సన్నవడ్ల కు రూ.5 వందల బోనస్ చెల్లించి రైతాంగాన్ని ఆదుకుంటుందన్నారు. రైతు భరోసా కింద రైతులకు నగదు సహాయాన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోని పెద్దలు అక్రమ అర్జనకే అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల ముందు తాము ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్పారు. చిన్నకల్వల సొసైటీ రైతులకు సేవలు అందించడంలో ముందుంటుందని, ఇతర సొసైటీలకు ఆదర్శంగా చైర్మన్, పాలకవర్గం, అధికారులు సిబ్బంది సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గారు అన్నారు.అనంతరం సొసైటీ పరిధిలోని రైతులకు రూ. 18 లక్షల దీర్ఘకాలిక రుణాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవరనేని మోహన్ రావు, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, సీఈవో వి. రమేష్, ఏరుకొండ తిరుపతి, డైరెక్టర్లు మరియు అన్నమనేని మాధవరావు, సాయిరి మహేందర్, అన్నమనేని కొండలరావు సాగర్ రావు, దేవేందర్ రావు, ఏరుకొండ రమేష్, తిరుపతి, సుగుణాకర్ రావు, భూషణవేణి రాజా గౌడ్ తో పాటు సంఘం కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పలువురు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :