Tuesday, 11 August 2026 02:53:37 PM

సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కరానికి కృషి చేస్తా...

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్...

Date : 07 March 2025 01:00 PM Views : 447

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సింగరేణి మారుపేర్ల పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ కు సింగరేణి కార్మికుల వారసులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ ముందే మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరిస్తామని, ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని తెలియజేసినట్లు వారు తెలిపారు. కావున సింగరేణి కార్మికులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని తెలిపారని వారన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో లక్క శ్రావణ్ గౌడ్, తిరుమల శ్రీనివాస్, రామిళ్ళ సందీప్, పున్నం వెంకటేష్, పర్తపల్లి హరీష్, ఇంజపెళ్లి ఓం ప్రకాష్, సాయికిరణ్, ఈర్ల రాజయ్య, డిష్ బాబు తదితరులు ఉన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :