ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : నా మొత్తం ఆస్తులు భూములు కలిపి 10 కోట్ల రూపాయల వరకు ఉంటాయని బూడిద, ఇసుక దందాలో ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే గంట లోపు కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని తన బ్యాంకు పాస్ బుక్కులను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ యూ ఐ నాయకులు దాసరి విజయ్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే,నాయకులకు, కార్యకర్తలకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో గాథం విజయ అమాయక ప్రజల నుండి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా షాడో ఎమ్మెల్యేనే అని స్పష్టం చేశారు. మీకు నా గురించి తెలియదు. మీరు అనుకునే అంత మంచోన్ని నేను కాదు అని బహిరంగంగా హెచ్చరించారు. త్వరలో మహంకాళి స్వామి రామగుండం నియోజకవర్గంలో ఉన్నత స్థాయి పదవిని అధిరోహిస్తారని తెలిపారు. ఈరోజు ఉన్న పదవి వరకు మహంకాళి స్వామికి క్లీన్ చీట్ ఉందని స్పష్టం చేశారు.
Admin
Aakanksha News