Saturday, 27 June 2026 08:57:50 PM

నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం...

రంగాపూర్ పంచాయితీ కార్యదర్శి సదయ్య.

Date : 13 March 2025 05:30 PM Views : 440

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : చొప్పదండి మండలం కొలిమికుంట భూ వ్యవహారంలో కరీంనగర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు లావణ్య చేసిన ఆరోపణలు అవాస్తవమని పెద్దపల్లి మండలం రంగాపూర్ పంచాయితీ కార్యదర్శి గుమ్మడి సదయ్య ఖండించారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన భార్య రాజేశ్వరి పేరుపై ఆమె కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూమిని మరొకరికి కూడా విక్రయించి పట్టా చేయకుండా అమ్మినవారు నానా ఇబ్బందులు సృష్టించారని తెలిపారు. ఒకే భూమిని ఇద్దరికీ అమ్మి డబ్బులు ఇవ్వడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. నా భార్య కొనుగోలు చేసిన భూమి వివాదం కోర్టు కేసులో ఉందని చెప్పారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఉద్యోగినైన నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ కొందరు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు సంబంధించిన భూ వివాదాన్ని కోర్టులో తేల్చుకుంటుందని, అందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు కావాలనే తనపై కక్ష్య పూరితంగా కరీంనగర్ నుండి వచ్చి పెద్దపల్లిలో పిర్యాదు చేయడంలో మతలబు ఏమిటో అర్థం అవుతోందని అన్నారు. భూ ఆక్రమణపై తనకు సంబంధం లేదని చెప్పారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తే వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :