Monday, 10 August 2026 04:08:34 PM

పద్మశాలి మహాసభలను విజయవంతం చేయండి....

Date : 04 March 2025 01:48 PM Views : 462

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శివాలయంలో పద్మశాలి మహా సభలను విజయవంతం చేయాలని సంఘం ప్రతినిధులు కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ... ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు.ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బండారి రాయమల్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అడక్ కమిటీ చైర్మన్ వలస నిలయ్య, తెలంగాణ పద్మశాలి సేవా సంఘం ఆర్గనైజ్ సెక్రెటరీ బుర్ల లక్ష్మినారాయణ, పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెటి రాజేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చందు పెగడ, పోపా అధ్యక్షులు వడ్డేపల్లి దినేష్, RS మూర్తి, , సిరిపురం నరసయ్య, గుండెటి శంకర్, అన్నల్ దాస్ శ్రీనివాస్, బొద్దుల వేణు, కన్నం ప్రభాకర్, రాజేష్, దాసరి శ్రీనివాస్, బండారి స్రవంతి, తౌటం శాంతి, చింతల రాజేందర్, నాగేశ్వర రావు, సోడాల శ్రీను, బొడ్డుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :