Wednesday, 23 September 2026 03:20:34 AM

అమ్మవారిని దర్శించుకున్న బిజేపి నాయకురాలు కందుల సంధ్యారాణి...

Date : 08 October 2024 05:16 PM Views : 424

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో సాయిబాబా ఆలయం వద్ద నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బిజెపి రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ..అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి, సమృద్ధి, అభివృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు.ప్రజలు అందరూ ఒకటిగా ఉండి, ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో మంచిని వ్యాప్తి చేయాలని అమ్మవారి మాల ధరించిన భక్తులకి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ధార్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఏకతను, సహకారాన్ని పెంపొందించేందుకు ఎంతో సహాయపడతాయని అన్నారు. దసరా వంటి పండుగలు మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ఈ పండుగలను మనం పెద్దఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాక, సమాజ సేవలో భాగస్వామ్యమవుతూ, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు యువత ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో కుమార్,సాగర్,వేణు,అక్షయ్,అనిల్,పండు,మహేష్,భాస్కర్,దుర్గ,శివ,మల్లేష్,రేణుక,సునితా,పావని,స్వాతి,లావన్య,భాగ్య,పద్మ,రేణుక,క్రాంతి,కనకలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :