Monday, 10 August 2026 02:55:58 PM

రెండు గనుల్లో గని ప్రమాదాలు..

ఇద్దరు కార్మికులకు గాయాలు..

Date : 21 January 2025 04:59 PM Views : 1086

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం రీజియన్ లోని రెండు వేరువేరు గనుల్లో జరిగిన గని ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు గాయపడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే..11వ ఇంక్లైన్ లో పని చేస్తున్న శివాజీ నగర్ కు చెందిన సతీష్ అనే కార్మికుడికి గాయాలు కావడంతో సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అలాగే 1వ ఇంక్లైన్ లో పని చేస్తున్న సిద్దరాజు అనే కార్మికుడి చేతికి తీవ్ర గాయం కావడంతో చేతి వేళ్ళు విరిగిపడినట్లు సమాచారం. వెంటనే చికిత్స నిమిత్తం సింగరేణి ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :