Friday, 26 June 2026 01:21:34 AM

ఎమ్మెల్యే కొడుకుకు పోలీస్ కాన్వాయ్ తో గ్రౌండ్ వెళ్లి ఎస్.ఐ క్రికెట్ ఆడతారా....

ఎమ్మెల్యే మీ ప్రమేయం లేకపోతే తడి బట్టలతో పోచమ్మ గుడికి రండి...కందుల సంధ్యారాణి

Date : 08 November 2025 12:14 PM Views : 884

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఒక ఎస్ఐ ఎమ్మెల్యే కొడుకుకు కాన్వాయ్ తో వెళ్లి గ్రౌండ్ లో పోలీస్ యూనిఫామ్ మీద క్రికెట్ ఆడతారా అని బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి కొండపర్తి సంజీవ్ లు ప్రశ్నించారు. గోదావరిఖని క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి, బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మరియు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీస్ యూనిఫాం పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.ఎమ్మెల్యే కొడుకుతో కలిసి పోలీస్ కాన్వాయ్‌ గ్రౌండ్‌కు వెళ్లి ఎస్‌.ఐ. క్రికెట్ ఆడతారా? అని సంధ్యారాణి ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను తమ పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ, గుడి నిర్మాణాలను ఏటీఎంలా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. గుడి పేరుతో దోపిడీ జరుగుతోందని చెప్పకనే చెప్పారు అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఎన్నికల అఫిడవిట్‌లో కోటి రూపాయలకు పైగా అప్పు, నాలుగు కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే స్వయంగా పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అధికారులు ఎమ్మెల్యే కనుసైగల్లో పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.అధికారులు మీ మాట వినకపోతే, ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హత లేదు... రాజీనామా చేయండి,” అంటూ ఆమె డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు.అదే విధంగా అడిషనల్ కలెక్టర్‌పై ఇప్పటి వరకు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుడుల కూల్చివేత ఘటనల్లో కార్పొరేషన్ అధికారులు ప్రత్యక్షంగా ఉన్నారని, ఈ విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్తామని సంధ్యారాణి హెచ్చరించారు.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు గుడుల కూల్చివేతలు అధికారుల వల్లే ఈ ఘటనలు జరిగాయని చెప్పడం అసత్యమని బీజేపీ నేతలు ఖండించారు.అధికారులు ఎమ్మెల్యే ఆజ్ఞతోనే ఈ చర్యలకు పాల్పడ్డారు. ఆయన కనుసైగల్లోనే పోలీసులు, కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని కొండపర్తి సంజీవ్ మండిపడ్డారు.అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ నేతలు గుడుల కూల్చివేత ఘటనను ఇంతటితో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.అదే విధంగా, అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భార్య పాల్గొనడమేంటని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దుర్వినియోగం అని సంధ్యారాణి పేర్కొన్నారు. మీ ప్రమేయం లేకుంటే తడి బట్టలతో పోచమ్మ గుడికి రండి... అప్పుడు మీ నిజాయితీని ప్రజలు నమ్ముతారని ఆమె సవాల్ చేశారు. హిందూ దేవాలయాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు బీజేపీ నిశ్చలంగా ఉండదని నేతలు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, కోమల్ల మహేష్, జక్కుల నరహరి, గుండబోయిన భూమయ్య, అపర్ణ, సుభాష్, రాజయ్య, శ్యాంప్రసాద్ హరీష్ కోడూరు రమేష్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :