Tuesday, 11 August 2026 07:51:40 PM

అంబేద్కర్ భవనాన్ని తక్షణమే పూర్తి చేయండి

Date : 21 January 2025 09:02 PM Views : 554

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 31 డివిజన్ శివాజీ నగర్ లో నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనాన్ని పూర్తి చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 31 డివిజన్ శాఖ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కి శాఖ జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ కి 31 వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి వినతి పత్రం అందజేశారు. మంగళవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 31 డివిజన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం శివాజీ నగర్ శాఖ అధ్యక్షులు పెద్దెల్లి రామస్వామి ప్రధాన కార్యదర్శి పెరుక రవి మహంకాళి హనుమంతు కలువల అరుణ్ కుమార్ పాల్గొని పలు సమస్యలపై చర్చించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :