ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నమోదైన కార్మికుల పిల్లలకు ప్రస్తుత సమయంలో 30 వేల రూపాయలను లేబర్ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే దీనిని ఆసరా చేసుకుని లేబర్ కార్డు దరఖాస్తు చేయడానికి నిరుపేదల నుండి గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ఓ మీసేవ నిర్వాహకుడు దన దాహంతో అందిన కాడికి దండుకుంటున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన లేబర్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి 110 రూపాయలను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అమాయక ప్రజల నుండి ఒక్కో దరఖాస్తుకు సుమారుగా 250 రూపాయలకు పైగా డబ్బులను వసూళ్లు చేస్తూ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా తనకున్న పలుకుబడితో ఇదేమిటని ఎవరైనా అడిగితే నేను ప్రధాన విభాగంలో సమాచార సేకరణలో పని చేస్తున్నానంటూ ఇతరులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సదరు మీ సేవ నిర్వాహకుడిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేబర్ కార్డుల పేరుతో దోపిడీకి పాల్పడుతూ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న సదరు వ్యక్తికి కొంత మంది అండదండలు ఉన్నాయని దీంతో తను ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఈయన మీ సేవకు మాత్రమే ప్రత్యేకత ఏమిటి....
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎవరి నోట విన్న ఎక్కడ చూసినా సదురు మార్కండేయ కాలనీ మీసేవ నిర్వాహకుడి పేరు మాత్రమే వినిపించడం వెనక ఆంతర్యం ఏమిటి... ఈయన అధికారులకు ఎంత చెబితే అంత.. అనడం వెనుక మర్మం ఏమిటి...? కేవలం ఈయన దగ్గర మాత్రమే లేబర్ కార్డుల ప్రత్యేకత ఎందుకు ఉంది. అనేది అంత చిక్కని సమస్యగా మారింది. దీనిని ఆసరా చేసుకుని అందిన కాడికి దండకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. సదురు మీ సేవ నిర్వాహకుడిపై పూర్తి ఆధారాలతో రేపటి ఆకాంక్ష న్యూస్ ప్రత్యేక కథనం...
Admin
Aakanksha News