Saturday, 26 September 2026 05:08:04 AM

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గంలోకి మహిళామణులు..

రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలిగా అనుముల కళావతి, బైరి నాగమణి

Date : 29 October 2024 06:24 PM Views : 766

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది రాణించాలని వారు అగ్రగామిగా నిలవాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ మొదటి నుండి మహిళలకు ప్రాధాన్యతను కల్పిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలోకి వివిధ జిల్లాల నుండి వారి ప్రతిభను గుర్తించి మహిళమణులను తీసుకోవడం జరిగిందన్నారు. వీరిలో రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలిగా గోదావరిఖనికి చెందిన అనుముల కళావతి, యైటింక్లెయిన్ కాలనీకి చెందిన బైరి నాగమణిని నియమించారు.ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని మీ ప్రాంతాలలో జిల్లాల్లో పద్మశాలి మహిళా శక్తిని గ్రామ గ్రామాన బలోపేతం చేయడానికి సన్నాహాలు చేయాలని పద్మశాలి జాతి చైతన్యం కోసం చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిస్తూ వారికీ రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులుకి కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :