Friday, 26 June 2026 01:14:44 AM

శాంతి మార్గంలో దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహనీయులు మహాత్మ గాంధీ

Date : 30 January 2025 05:11 PM Views : 462

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని చౌరస్తాలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ కోలిపాక సుజాత. బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ. భారత దేశం స్వతంత్ర సంగ్రామంలో జాతిని జాగృతం చేస్తూ శాంతి యుత మార్గం లో ఉప్పు సత్యా గ్రహం క్విట్ ఇండియా విదేశీ వస్తూ బహిష్కరణ ఇలా అనేక పోరాటాలు శాంతి మార్గం లో దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చి నేడు జాతి పిత గా శాంతి దూత గా భారత దేశ ప్రజలచే కీర్తించ బడుతూ ప్రపంచ ప్రజలకు వారు చూపిన అహింస శాంతి మార్గం సత్య మార్గాలు ఆచరణీయం అనుసర నియం అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ కార్పొరేటర్ ముస్తఫా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సూతారి లక్ష్మన్ బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మక రాజేష్, కల్యాణి సింహ చలం, దాసరి సాంబ మూర్తి, చుక్కల శ్రీనివాస్, మహ్మద్, గడ్డం శేఖర్, బాబు మియా, గడ్డం శ్రీనివాస్, అడేపు రవి, నజిముద్దిన్, గుండేటి శంకర్, మాలం మదు, దశరథం, దాసరి విజయ్, అల్లి శంకర్, కీర్తి నాగరాజు, పత్యం రాజు, లతో పాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :